తప్పిన పెను ముప్పు...10 మందుపాతరలు నిర్వీర్యం
ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ పగదండి మార్గ మధ్యలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని అమర్చిన ఎనిమిది మందు పాతరలను భద్రతా బలగాలు కనుక్కొని నిర్వీర్యం చేశారు.
దిశ, భద్రాచలం : ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ పగదండి మార్గ మధ్యలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని అమర్చిన ఎనిమిది మందు పాతరలను భద్రతా బలగాలు కనుక్కొని నిర్వీర్యం చేశారు. అలాగే బీజాపూర్ జిల్లా తర్రేం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపల్లి, చుట్ వాయి అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని అమర్చిన మరో రెండు మందుపాతరలను కనుగొని నిర్వీర్యం చేశారు. దీంతో భద్రతా బలగాలకు పెను ముప్పు తప్పింది.