Reethu Chowdary : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. రీతూ చౌదరి విచారణ
డబ్బులకు ఆశపడి బెట్టింగ్ యాప్స్(Betting Apps Case) ప్రమోట్ చేసిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్(YouTube Influencers) మెడకు కేసుల ఉచ్చులు బిగుసుకుంటున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : డబ్బులకు ఆశపడి బెట్టింగ్ యాప్స్(Betting Apps Case) ప్రమోట్ చేసిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్(YouTube Influencers) మెడకు కేసుల ఉచ్చులు బిగుసుకుంటున్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువురు తెలుగు ప్రముఖ నటులు, ఇన్ఫ్లుయెన్సర్స్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో(Panjagutta PS) కేసులు నమోదుకాగా.. వారంతా విచారణను ఎదుర్కొంటున్నారు. కాగా గురువారం నటి విష్ణుప్రియ(VishnuPriya)ను పంజాగుట్ట పోలీసులు 3 గంటలపాటు విచారించగా.. అనంతరం మరో యూట్యూబ్ స్టార్ రీతూ చౌదరీ(Reethu Chowdary)ని పోలీసులు విచారించారు. విచారణ అనంతరం రీతూ చౌదరీ ఓ వీడియోను విడుదల చేశారు. తెలిసో తెలియకో తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశానని ఒప్పుకున్నారు.
అయితే అవన్నీ గతంలో చేశానని.. బెట్టింగ్ యాప్స్ ను ఎవరూ నమ్మకండి అంటూ చెప్పింది. వాటిని నమ్మి ఎవరూ డబ్బులు మోసపోవద్దని రీతూ వీడియోలో పేర్కొంది. కాగా ప్రముఖ నటులు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు 11 మంది సెలెబ్రెటీలపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తవ్విన కొద్దీ మరింతమంది టాలీవుడ్ టాప్ హీరోలు, హీరోయిన్ల పేర్లు బయటికి వస్తున్నాయి. కాగా వీరందరికీ పోలీసులు నోటీసులు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
READ MORE ...
Vishnupriya: బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల స్పీడ్.. పంజాగుట్ట పీఎస్ లో విచారణకు విష్ణుప్రియ