పుట్టిన రోజు వేడుకలో బ్యూటీషియన్‌పై అత్యాచారం.. మద్యం తాగించి..
వృత్తిలో మంచి అవకాశాలు కల్పిస్తానని యువతిని నమ్మించి పలు మార్లు అత్యాచారం చేసిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దిశ, పేట్ బషీరాబాద్: వృత్తిలో మంచి అవకాశాలు కల్పిస్తానని యువతిని నమ్మించి పలు మార్లు అత్యాచారం చేసిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గాజుల రామారానికి చెందిన యువతి (28) వృత్తిరీత్యా బ్యూటీషియన్. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్‌గా పలు చోట్ల పనిచేసింది. స్నేహితుల ద్వారా పరిచయమైన సంజీవ్ రెడ్డి ఆమెతో స్టూడియో పెడదామని నమ్మించి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో పలుమార్లు సంజీవ్ రెడ్డి బాధితురాలిపై బలవంతంగా అత్యాచారం చేశాడు. బాధితురాలు భయంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత నమ్మించి మోసం చేశాడని గ్రహించిన బాధితురాలు సంజీవ్ రెడ్డికి దూరంగా ఉంటూ వస్తోంది. అయినప్పటికీ తరచుగా సంజీవ్ రెడ్డి బాధితురాలి ఇంటికి వచ్చి లైంగికంగా వేధించేవాడు. కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద గౌరవం పోతుందని భయపడిన బాధితురాలు ఈ విషయాన్ని కూడా బయటకు చెప్పకుండా మౌనంగా వేధింపులు భరిస్తూ వచ్చింది.
అయితే బుధవారం బాధితురాలి పుట్టిన రోజు కావడంతో సంజీవ్ రెడ్డి మరో మారు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెతో బలవంతంగా మద్యం తాగించి మరోమారు అత్యాచారం చేశాడు. జరుగుతున్న వరుస వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించిన బాధితురాలు ముందుగా విషయాన్ని ఆమె స్నేహితుడితో పంచుకుంది. అనంతరం బుధవారం అర్ధరాత్రి సమయంలో బాధితురాలు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పిల్లలు పుట్టిస్తానని అత్యాచారం చేసిన స్వామిజీ.. ఆపై దేవుడే సెక్స్ చేశాడని..