మద్యం మత్తులో యువకుడిపై దాడి
ఎల్లారెడ్దిపేట గ్రామానికి చెందిన శివరాత్రి పర్శురాములు అనే వ్యక్తి పై పలువురు దాడి చేయగా చావు బతుకుల మధ్య మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
దిశ,ఎల్లారెడ్దిపేట : ఎల్లారెడ్దిపేట గ్రామానికి చెందిన శివరాత్రి పర్శురాములు అనే వ్యక్తి పై పలువురు దాడి చేయగా చావు బతుకుల మధ్య మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే క్రమంలో ఒడ్డెర కాలనీలో డీజే సౌండ్స్ మధ్య నృత్యాలు చేశారు.
అందరితో పాటు శివరాత్రి పర్శురాములు నృత్యం చేస్తుండగా ఒడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి నరేష్ వ్యక్తిగత కక్షలతో గాయపరిచారు. వెంటనే 100 డయల్ కు ఫోన్ చేయగా స్పందించిన పోలీసులు పర్శురాములును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. స్థానిక ఎస్ఐ రమాకాంత్ విచారణ జరుపుతున్నారు.