గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ధర్మవరం పట్టణంలోని పోతుకుంట రైల్వే ఉపరితల వంతెన కింద గుర్తు తెలియని మృతదేహం గుర్తించారు.
దిశ ప్రతినిధి, ధర్మవరం: ధర్మవరం పట్టణంలోని పోతుకుంట రైల్వే ఉపరితల వంతెన కింద గుర్తు తెలియని మృతదేహం గుర్తించారు. జరిగిన సంఘటన గురించి శుక్రవారం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పట్టణ టు టౌన్ సిఐ రెడ్డప్ప సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుర్గా నగర్ బ్రిడ్జి కింద రాత్రి సమయంలో తాగి పడిపోవడం వలన చనిపోయాడు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టిన యెడల ధర్మవరం 2 టౌన్ పీఎస్ వారికి తెలియజేయగలరు, inspector 2 Town Police Station-6305800429,9704972324 లకు సమాచారం తెలియజేయాలని సీఐ తెలిపారు.