బాంబు బెదిరింపు.. న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం దారి మళ్లించి..

ముంబై నుంచి న్యూయార్క్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అర్ధాంతరంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కావల్సి వచ్చింది.

Update: 2024-10-14 03:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముంబై నుంచి న్యూయార్క్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అర్ధాంతరంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కావల్సి వచ్చింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజమాను చోటు చేసుకుంది. ప్రస్తుతం విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ఉంది. దీనిపై స్పందించిన పోలీసు అధికారులు.. ప్రస్తుతం విమానంలో బాంబు కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని, ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా కచ్చితమైన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అన్నీ పాటించి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. భద్రత ప్రమాణాల పరీశీలన పూర్తయిన తర్వాత విమానం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరుతుందని తెలిపారు.

ఇదిలా ఉంటే ఇటీవలే హదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఇండిగో విమానానికి ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానంలో బాంబు ఉందంటూ అన్‌నోన్ మెయిల్ రావడంతో.. అధికారులు అప్రమత్తమై బాంబు కోసం విమానంలో తనిఖీలు నిర్వహించారు. 2 గంటల పాటు ఫ్లైట్ టేకాఫ్‌ను రద్దు చేసి చెక్ చేసినా ఎక్కడా బాంబు దొరక్కపోవడంతో తమకు వచ్చింది ఫేక్ మెయిల్ అని అర్థమై ఊపిరి పీల్చుకున్నారు.


Similar News