Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే అడిషనల్ ఎస్పీ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ మృతిచెందిన ఘటన హయత్​నగర్ పోలీస్‌స్టేషన్​ పరిధిలోని లక్ష్మారెడ్డి‌పాలెం వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Update: 2025-03-22 01:50 GMT
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే అడిషనల్ ఎస్పీ దుర్మరణం
  • whatsapp icon

దిశ, వనస్థలిపురం: రోడ్డు ప్రమాదంలో అడిషనల్ ఎస్పీ మృతిచెందిన ఘటన హయత్​నగర్ పోలీస్‌స్టేషన్​ పరిధిలోని లక్ష్మారెడ్డి‌పాలెం వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హయత్‌నగర్ ​సీఐ నాగరాజు గౌడ్ కథనం మేరకు.. లక్ష్మారెడ్డిపాలెం ప్రాంతంలో నివాసం ఉండే అడిషనల్ ఎస్పీ నందీశ్వర్​బాబ్జీ (50) శనివారం తెల్లవారుజామున వాకింగ్‌కు అని వెళ్లారు. సుమారు 4.40 గంటల ప్రాంతంలో హనుమాన్​టెంపుల్ సమీపంలో హైవేను దాటుతుండగా.. అబ్దుల్లాపూర్ నుంచి హయత్‌నగర్ వైపు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌ నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బాబ్జీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అతడు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న నందీశ్వర్ బాబ్జీ ఇటీవలే అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ పొందినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ నాగరాజు వెల్లడించారు. 

Tags:    

Similar News