ఏసీబీ వలలో స్కూల్ ప్రిన్సిపల్.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా..!

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విక్టోరియా మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Update: 2024-09-28 03:53 GMT

దిశ, చైతన్యపురి: ఫుడ్ కాంట్రాక్టు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబి అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు ఓ ప్రిన్సిపల్. సరూర్ నగర్ కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్‌ స్కూల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ ఏసీబి అధికారులకు పట్టుబడ్డాడు. స్కూల్‌లో ఫుడ్ కాంట్రాక్ట్‌ విషయంలో అవకతవకలపై ఫిర్యాదులు అందడంతో ప్రభుదాస్‌పై నిఘా పెట్టిన ఏసీబీ.. శుక్రవారం నాడు కాంట్రాక్టర్‌ నుంచి రూ.29 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఆయనను పట్టుకుంది. ఫుడ్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన వాస్తవ బిల్లుల కన్నా అధిక బిల్లులు సృస్టించి దానికి సంబంధించిన రూ. 29 వేలను సదరు కాంట్రాక్టర్ నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు ప్రభుదాస్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ క్రమంలోనే ఉప్పల్‌లోని ప్రభుదాస్ నివాసంలో కూడా సోదాలు నిర్వహించింది. ఒకవేళ ఆయన వద్ద అక్రమాస్తులు ఉన్నట్లు తేలితే నిందితుడిపై ఆ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రభుదాస్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కీచక ప్రిన్సిపల్ తన స్కూల్లో ఉండే అనాథ పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా స్కూల్‌నే తన కోటగా మార్చుకుని అక్రమాలకు తెగబడుతున్నాడనేది ఆయనపై ప్రధాన ఆరోపణ. ఇక స్కూల్‌ టెండర్ల విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డాడని, పాఠశాల నిధులను కూడా పక్కదారి పట్టించి భారీగా డబ్బు దండుకున్నాడని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ తమ తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. 



  


Similar News