భయంతో పురుగుల మందు సేవించిన యువకుడు.. చికిత్స పొందుతూ మృతి..

భయంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట జరిగింది.

Update: 2024-11-07 03:10 GMT

దిశ, అచ్చంపేట రూరల్ : భయంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే పెద్దకొత్తపల్లి మండలం, యాపట్ల గ్రామానికి చెందిన రుబ్బురి మస్తాన్ (21) అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. అయితే అదే కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయితో స్నేహంగా ఉండేవాడు. ఈ విషయం అమ్మాయి అన్నకు తెలియడంతో వారు తనను ఏం చేస్తారో అనే భయంతో మంగళవారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అది గమనించిన తోటి స్నేహితులు అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం విద్యార్థి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అచ్చంపేట ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News