కూల్ డ్రింక్ అనుకొని గడ్డి మందు తాగిన స్టూడెంట్

కూల్ డ్రింక్ అనుకొని ఓ విద్యార్థిని పురుగుల మందు తాగింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల ఆదర్శ పాఠశాలలో చోటు చేసుకుంది.

Update: 2024-11-09 16:19 GMT

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : కూల్ డ్రింక్ అనుకొని ఓ విద్యార్థిని పురుగుల మందు తాగింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల ఆదర్శ పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని హాస్టల్ కు వచ్చేముందు ఇంటి దగ్గర గొడవ జరిగింది. దాంతో ఆ విద్యార్థిని కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలుపుకొని హాస్టల్ కి తీసుకువచ్చింది.

    ఇది గమనించని మరో స్టూడెంట్ కూల్ డ్రింక్ అనుకొని దానిని తాగింది. బాటిల్ తీసుకొచ్చిన స్టూడెంట్ వద్దు అని వారించే లోపే ఈ ఘటన జరిగింది. ఈ విషయం ప్రిన్సిపాల్ కు తెలిపి బాధిత స్టూడెంట్ ను వెంటనే రాయికల్ కు ప్రథమ చికిత్స తర్వాత అక్కడి నుంచి జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రికి వెళ్లి బాలిక పరిస్థితి పరిశీలించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రమాదం ఏమీ లేదని తెలిపారు.


Similar News