దశాబ్ది ఉత్సవాలకు వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదం.. ఆ తరువాత మంటల్లో పడి యువకుడు..
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై అదే సమయంలో మంటల్లో పడి యువకుడు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలోని చిన్నంబావి మండల పరిధిలో జరిగింది.
దిశ, చిన్నంబావి: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై అదే సమయంలో మంటల్లో పడి యువకుడు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలోని చిన్నంబావి మండల పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నంబావి మండల పరిధి అమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మహేష్ గౌడ్ (25) విద్యుత్ శాఖలో కాంట్రాక్టు కింద స్పాట్ బిల్లర్ గా పని చేస్తున్నాడు.
మండల పరిధి అయ్యవారిపల్లి గ్రామంలో కరెంట్ బిల్లులు కొట్టి కొల్లాపూర్ లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు హాజరయ్యేందుకు బయలుదేరాడు. ఈ క్రమంలో మార్గం మధ్యలో మండల కేంద్రం సమీపంలోని కేడీఆర్ పాఠశాల వద్ద ఆటో ఢీకొట్టడంతో అదే సమయంలో రోడ్డు పక్కన రైతు పొలంలోని వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో ఆ మంటల్లో ఎగిరి పడటంతో మంటల్లో కాలీ సజీవ దహనం అయ్యాడు. దీనిపై కేసును నమోదు చేసి విచారిస్తామని ఎస్ఐ వస్రం నాయక్ అన్నారు. యువకుడి అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కొడుకు అగ్నికి ఆహుతి అవడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి.