అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని లద్నూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

Update: 2023-05-09 14:20 GMT
అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
  • whatsapp icon

దిశ, మద్దూరు : అప్పుల బాధ తాళలేక వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని లద్నూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మానేపల్లి పరశురాములు (37) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతను మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో తాగిన మైకంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గమనించిన కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటినా జనగామ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా అక్కడ పరశురాములు చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటి పెద్ద చనిపోయిన బాధలో ఉన్న కుటుంబ సభ్యులు పరశురాములు నేత్రాలను దానం చేశారు. అతని కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకొవాలని గ్రామస్థులు కోరారు. 

Tags:    

Similar News