పండుగపూట విషాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి

దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

Update: 2022-08-31 03:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో విద్యుత్ షాక్‌కు గురై ఏడాది చిన్నారి, తల్లి అక్కడికక్కడే మృతిచెందారు. కాపాడేందుకు వెళ్లిన మరో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో గమనించిన స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, పండుగపూట తల్లీకూతురు కరెంట్ షాక్‌తో మరణించడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News