క్షణికావేశం నిండు ప్రాణం తీసింది..
మండలంలోని తుపాకులగూడెంలో సోలం సరిత అనే మహిళ పురుగుల మందు తాగి మృతి చెందింది.

దిశ,కన్నాయిగూడెం : మండలంలోని తుపాకులగూడెంలో సోలం సరిత అనే మహిళ పురుగుల మందు తాగి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సోలెం కృష్ణకు తన భార్య సరిత మధ్య బుధవారం రాత్రి గొడవ జరిగింది. దాంతో మనస్థాపానికి గురైన సరిత పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. సరిత తల్లి సాగబోయిన రామక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కన్నాయిగూడెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.