police station : పోలీస్ స్టేషన్లో వ్యక్తి హల్ చల్.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం..
పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది.
దిశ, జడ్చర్ల : పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. స్థానికులు, విశ్వసనీయ సమాచారం ప్రకారం మండల పరిధిలోని మోతీ ఘనపూర్ గ్రామానికి చెందిన కాళిల్ (32) తాగిన మైకంలో కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడని, ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రుల పై ఫిర్యాదు చేయడానికి వచ్చాడని తెలిపారు. అనంతరం కాసేపటికే పోలీస్ స్టేషన్ బయట ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకొని పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చాడని అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డు రాము ఖలీల్ కు అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో హోంగార్డ్ రాముకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. వెంటనే ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టిన ఖలీల్ ను స్వల్పంగా గాయపడిన హోంగార్డ్ రామును సహచర పోలీసులు చికిత్స నిమిత్తం హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఆత్మహత్యయత్నానికి వడిగట్టిన ఖలీల్ గతంలో కూడా తన కుటుంబ సభ్యులతో గొడవపడి విడిచి పై నుండి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు సమాచారం.