కిలో గంజాయి పట్టివేత
మండలంలోని రెడ్డిపల్లి గ్రామ శివారులో గంజాయి పట్టుబడినట్టు జమ్మికుంట టౌన్ సీఐ రవి, వీణవంక ఎస్సై తిరుపతి తెలిపారు.
దిశ,వీణవంక : మండలంలోని రెడ్డిపల్లి గ్రామ శివారులో గంజాయి పట్టుబడినట్టు జమ్మికుంట టౌన్ సీఐ రవి, వీణవంక ఎస్సై తిరుపతి తెలిపారు. పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ... ఘన్ముక్ల గ్రామానికి చెందిన బొంగోని పవన్ సాయి(23), నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బుర్ర శ్రీనాథ్(19) అనే యువకులు తమ ద్విచక్ర వాహనాల్లో గంజాయి తరలిస్తూ అనుమానాస్పదంగా కనపడగా ఇద్దరు యువకులను తనిఖీ చేయగా వారి వద్ద కిలో గంజాయి పట్టుబడినట్లు తెలిపారు.
పట్టుబడిన గంజాయి వీరు మహారాష్ట్రలోని బల్లర్శా నుండి రైలు మార్గం ద్వారా తీసుకొచ్చి స్థానికంగా అమ్ముతున్నారని తెలిపారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లల అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి ప్రవర్తనను నిత్యం గమనిస్తూ ఉండాలని అన్నారు. గంజాయికి అలవాటు పడిన వారు చోరీలకు పాల్పడడం ద్వారా బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ఎవరైనా గంజాయి రవాణా చేసినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.