రైఫిల్ తో కాల్చుకొని జవాన్ ఆత్మహత్య..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, కొండగావ్‌లోని బర్దా నివాసి హరిలాల్ నాగ్ అనే సైనికుడు బస్తర్ ఫైటర్స్‌లో నియామకం అయ్యారు.
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, కొండగావ్‌లోని బర్దా నివాసి హరిలాల్ నాగ్ అనే సైనికుడు బస్తర్ ఫైటర్స్‌లో నియామకం అయ్యారు. అతని పోస్టింగ్ ధనోరా పోలీస్ స్టేషన్‌లో నియామకం అయ్యారు. కాగా నక్సల్స్ కార్యకలాపాల గురించి సమాచారం తెలుసుకునేందుకు ఆయన స్వగ్రామానికి వచ్చారు. ఇదిలా ఉంటే శనివారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరందబెడ పోలీసులు పిస్టల్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఫరస్‌గావ్ ఎస్‌డీఓపీ అనిల్ విశ్వకర్మ, కేష్‌కల్ ఎస్‌డీఓపీ భూపత్‌సింగ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.