అన్నం లేకుండా కూర చేసినందుకు భార్యను చంపిన భర్త

ఇంట్లో అన్నం లేకుండా కూర చేసినందుకు ఓ భర్త తన భార్యను హత్య చేశాడు. ఈ విచిత్ర సంఘటన ఒడిశాలోని సంబల్‌పూర్‌లో చోటు చేసుకుంది.

Update: 2023-05-09 07:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంట్లో అన్న లేకుండా కూర చేసినందుకు ఓ భర్త తన భార్యను హత్య చేశాడు. ఈ విచిత్ర సంఘటన ఒడిశాలోని సంబల్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూర వండి అన్నం వండనందుకు భార్యాభర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. మాటా మాటా పెరిగి భర్త కోపంతో భార్యను కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతురాలి కుమారుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా.. తల్లి మృతదేహం కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కొడుకు పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News