యువకుడి ప్రాణం తీసిన ఎదురుగా వచ్చిన ఎడ్ల బండి

ఎడ్ల బండి(cart)ని బైక్ (bike) ఢీకొని కోపగూడ గ్రామానికి సీడాం మంగు (35) మృతి చెందినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు.

Update: 2025-02-08 07:21 GMT
యువకుడి ప్రాణం తీసిన ఎదురుగా వచ్చిన ఎడ్ల బండి
  • whatsapp icon

దిశ, వాంకిడి : ఎడ్ల బండి(cart)ని బైక్ (bike) ఢీకొని కోపగూడ గ్రామానికి సీడాం మంగు (35) మృతి చెందినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. మేస్త్రి పనులు (construction worker) చేస్తు జీవనం సాగిస్తున్న మంగు శుక్రవారం రాత్రి తన పనులు ముగించుకుని బైక్ పై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో పాటగూడ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి(Asifabad Government Hospital)కి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. కుటుంబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Tags:    

Similar News