అక్రమంగా మట్టి తరలించిన వ్యక్తిపై కేసు నమోదు
అక్రమంగా కెనాల్ మట్టిని తరలించిన జేసీబీ యజమానిపై కేసు నమోదైంది.
దిశ, గన్నేరువరం : అక్రమంగా కెనాల్ మట్టిని తరలించిన జేసీబీ యజమానిపై కేసు నమోదైంది. ఎస్సై తాండ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గును కుల కొండాపూర్ గ్రామానికి చెందిన పొన్నాల మధు మంగళవారం రాత్రి అక్రమంగా కెనాల్ మట్టిని తన పొలంలో పోసుకొని చదును చేస్తుండగా గ్రామస్తులు ఇరిగేషన్ ఏఈఈ మహేందర్ కి ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అక్రమ మట్టి రవాణాను అడ్డుకున్న వారిని యజమాని భయభ్రాంతులకు గురి చేసినట్టు తెలిపారు. అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.