నీటి గుంతలో పడి బాలుడు మృతి

మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ నీటి తొట్టిలో పడి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కమ్మర్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

Update: 2024-10-02 13:12 GMT

దిశ, చిన్నకోడూరు : మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ నీటి తొట్టిలో పడి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కమ్మర్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బైకాన్ వేణు రేణుకల కుమారుడు రుద్రాన్స్ ( 3) ఆడుకుంటూ ఇంటి ముందు నిర్మించుకున్న నీటి తోటలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు తొట్టిలో నుండి తీసి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సిద్దిపేట లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. వేణు రేణుకలకు ముగ్గురు ఆడపిల్లలు. కుమారుడు మృతి చెందడంతో వేణు, రేణుకలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామంలో చిన్న బాబు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.


Similar News