చెట్ల పొదల్లో పసికందు..

అన్ని చోట్ల దేవుడు ఉండలేక అమ్మను సృష్టించినట్లు అందరూ చెబుతారు. అమ్మ ప్రేమ ముందు అన్నీ దిగదుడుపే.

Update: 2024-11-13 12:55 GMT

దిశ, కొండపాక : అన్ని చోట్ల దేవుడు ఉండలేక అమ్మను సృష్టించినట్లు అందరూ చెబుతారు. అమ్మ ప్రేమ ముందు అన్నీ దిగదుడుపే. అలాంటి మాతృ హృదయం కూడా కలుషితమై పోతుంది. బండరాయిలా మారిపోతుంది. కన్న పేగు ప్రేమను కాదనుకుని అప్పుడే పుట్టిన ఆడశిశువును చెట్ల పోదల్లో వదిలి వేసిన అమాన‌వీయ ఘ‌ట‌న సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని పల్లెవాడకట్టు సమీపంలో చెట్ల పోదల్లో గుర్తుతేలియని ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పోదల్లో వదిలేసి వెళ్లారని తెలుసుకుని గ్రామ తాజా మాజీ సర్పంచ్ మహదేవ్ గౌడ్, గ్రామస్తులు 108 సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న కొండపాక 108 సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ మహేందర్, పైలట్ మల్లేష్ లు అక్కడికి చేరుకుని పాపని అంబులెన్స్ లో ఎక్కించి 108 కాల్ సెంటర్ కి కాల్ చేసి డ్యూటిలో డాక్టర్ దుర్గాప్రసాద్ కి సమాచారం అందించి అతడి సలహాలు, సూచనలు పాటిస్తూ పాపకి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆసుపత్రిలో డ్యుటి డాక్టర్‌ గ్రీష్మకి ఆసుపత్రి సిబ్బంది సమక్షంలో పాపను సురక్షితంగా అప్పగించారు.

Tags:    

Similar News