లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి 9ఏళ్ల బాలుడి దుర్మరణం..
ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన పశ్చిమ దిల్లీలోని వికాస్‌పురి ప్రాంతంలో చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన పశ్చిమ దిల్లీలోని వికాస్‌పురి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆశిష్ అనే తొమ్మిదేళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి సీతాపురి ప్రాంతంలో నివసిస్తున్నాడు . అతని తల్లిదండ్రులు లాండ్రీ కార్మికులుగా పనిచేస్తున్నారు. మార్చి 24వ తేదీన పగటిపూట బట్టలు ఇస్త్రీ చేసి డెలివరీ చేసేందుకు ఆశిష్ తల్లి.. ఆశిష్‌ను తన దుకాణంలోనే వదిలేసి, జె బ్లాక్‌లోని 5వ అంతస్తులో ఉంటున్న వారి ఇంటికి వెళ్లింది. అయితే ఆమె అటూ వెళ్లగానే ఆ బాలుడు లిఫ్ట్‌లోకి ప్రవేశించాడు. లిఫ్ట్ లోపలికి వెళ్లిన తర్వాత, ఆశిష్ బటన్‌ను నొక్కాడు. ఆ తర్వాత లిఫ్ట్ పైకి వెళ్తుండగా ప్యానల్ మధ్యలోనే ఇరుక్కుపోయింది.
చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు అతని కోసం వెతకసాగారు. ఆశిష్ లిఫ్ట్‌లో చిక్కుకున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో అతడిని చాలా శ్రమించి లిఫ్ట్ నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చిన్నారి అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. పిల్లవాడు లిఫ్టు తలుపులు మూసే సమయంలో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు మధ్యలో ఇరుక్కుపోయాడని గుర్తించి.. ప్రమాదానికి సంబంధించి వికాస్పురి పోలీస్ స్టేషన్‌లో తెలియని వ్యక్తిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 287 , 304A కింద యంత్రాలకు సంబంధించి నిర్లక్ష్యం, నిర్లక్ష్యంతో ఆశిష్ మరణానికి కారణమైన వారిపై కేసు నమోదు చేశారు. అలాగే నేర పరిశోధన బృందం పరిశీలించింది. ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగుతోంది.