480 గ్రాముల గంజాయి పట్టివేత

మండలంలోని పొచ్చెర బస్టాండ్ వద్ద గంజాయి పట్టుకున్నట్టు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

Update: 2024-12-20 12:43 GMT

దిశ, బోథ్ : మండలంలోని పొచ్చెర బస్టాండ్ వద్ద గంజాయి పట్టుకున్నట్టు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోథ్ నుండి పొచ్చేర వాటర్ ఫాల్ వరకు పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా పొచ్చేర బస్టాండ్ వద్ద నేరడిగొండ మండలం రాజులతండా గ్రామానికి చెందిన బస్సీ చందర్ సింగ్ అనే అతను పోలీసులను చూసి పారిపోతుండడంతో వెంటనే పట్టుకుని విచారించగా నిందితుడు తన పొలంలో గత సంవత్సరం కొంత గంజాయి పండించి దానిని బోథ్, ఇచ్చోడ మార్కెట్లలో అమ్మడానికి తీసుకువెళ్తున్న క్రమంలో పొచ్చేర బస్టాండ్ వద్ద నిందితున్ని పట్టుకున్నట్టు తెలిపారు. అతని వద్ద ఉన్న 480 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు, దీని విలువ 12 వేల రూపాయలు ఉంటుందని, అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Similar News