హోండురస్ జైలులో దారుణం.. 41 మంది మహిళా ఖైదీల హత్య..

హోండురస్‌ దేశంలో దారుణం జరిగింది.

Update: 2023-06-21 11:59 GMT

తెగుసిగల్పా (హోండురస్‌) : హోండురస్‌ దేశంలో దారుణం జరిగింది. దేశ రాజధాని తెగుసిగల్పాకు వాయవ్యంగా 30 మైళ్ల (50 కి.మీ) దూరంలోని తమారా ఉమెన్ జైలులో మంగళవారం ఖైదీల మధ్య జరిగిన గొడవల్లో 41 మంది మహిళా ఖైదీలు మరణించారు. వీరిలో 25 మంది మహిళలు సజీవ దహనం కాగా, తుపాకీ బుల్లెట్ గాయాలతో 15 మంది మరణించారు. మరో ఏడుగురు మహిళా ఖైదీలు తుపాకీ కాల్పులు, కత్తి గాయాలతో తెగుసిగల్పా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. “జైలులో బార్రియో 18, మారా సాల్వత్రుచా (MS-13) అనే మహిళా ఖైదీల రెండు బ్యాచ్‌లు ఉన్నాయి. వీటి మధ్య ఘర్షణ జరిగింది.

ఈ గొడవే మరణాలకు దారితీసింది ” అని ఖైదీల కుటుంబాల సంఘం అధ్యక్షురాలు డెల్మా ఆర్డోనెజ్ తెలిపారు. “బార్రియో 18 కు చెందిన మహిళా ఖైదీలు.. మారా సాల్వత్రుచా (MS-13) గ్యాంగ్ మహిళా ఖైదీలు ఉండే సెల్ లోకి వెళ్లారు. ఆ తర్వాత రెండు గ్రూప్‌ల ఖైదీల మధ్య తుపాకీ కాల్పులు జరిగాయి” అని ఒక ఖైదీ చెప్పాడు. జైళ్లలో డ్రగ్స్ సేల్ వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు ఇటీవల చేసిన ప్రయత్నాల కారణంగానే రెండు ఖైదీల గ్యాంగ్స్ మధ్య అల్లర్లు జరిగాయని హోండురస్‌ జైళ్ల శాఖ అధిపతి జూలిస్సా విల్లాన్యువా పేర్కొన్నారు.


Similar News