కోర్టుకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
దిశ, క్రైమ్బ్యూరో: రాష్ట్రంలోని పలువురు ప్రజా ప్రతినిధులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ మరింత వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం వీరంతా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో నమోదైన పలు కేసులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జగ్గారెడ్డి, సీతక్క, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు నాంపల్లి సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను సోమవారానికి […]
దిశ, క్రైమ్బ్యూరో: రాష్ట్రంలోని పలువురు ప్రజా ప్రతినిధులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ మరింత వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం వీరంతా కోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గతంలో నమోదైన పలు కేసులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జగ్గారెడ్డి, సీతక్క, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు నాంపల్లి సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.