అర్థరాత్రి భార్య తలతో పోలీస్ స్టేషన్ కు…
దిశ, వెబ్ డెస్క్: దిశ ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సత్తెనపల్లి ఎన్ఎస్పీ అతిధి గృహం సమీపంలో మద్యం మత్తులో భార్యను వేటకొడవలితో హతమార్చాడో భర్త. గత అర్థరాత్రి 12 గంటల సమయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన భార్యను అడ్డగించిన భర్త శ్రీనివాసరావు(46)…ఆమెను దారుణంగా హత్య చేశాడు. అత్యంత పాశవికంగా భార్య మెడ నరికి, తల, మొండెంను వేరు చేశాడు. అనంతరం భార్య తలను తీసుకుని […]
దిశ, వెబ్ డెస్క్: దిశ ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సత్తెనపల్లి ఎన్ఎస్పీ అతిధి గృహం సమీపంలో మద్యం మత్తులో భార్యను వేటకొడవలితో హతమార్చాడో భర్త. గత అర్థరాత్రి 12 గంటల సమయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన భార్యను అడ్డగించిన భర్త శ్రీనివాసరావు(46)…ఆమెను దారుణంగా హత్య చేశాడు. అత్యంత పాశవికంగా భార్య మెడ నరికి, తల, మొండెంను వేరు చేశాడు. అనంతరం భార్య తలను తీసుకుని నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.