మ్యాచ్ ఓడిపోవడం చూసి ఏడ్చాను : ఇగొర్ స్టిమాక్
దిశ, స్పోర్ట్స్ : 2022 సాకర్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో ఒమన్‌పై టీమ్ ఇండియా ఓడిపోవడాన్ని చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని ప్రధాన కోచ్ ఇగొర్ స్టామిక్ అన్నారు. 2019 సెప్టెంబర్‌లో గౌహతీలో ఇండియా, ఒమన్ మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో చివరి వరకు టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలో ఉన్నది. అయితే చివరిలో ఒమన్ రెండు వరుస గోల్స్ చేయడంతో టీమ్ ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. ఆనాటి సంగతిని గుర్తు తెచ్చుకున్న స్టిమాక్..’గత మ్యాచ్‌లను గుర్తు […]
దిశ, స్పోర్ట్స్ : 2022 సాకర్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో ఒమన్‌పై టీమ్ ఇండియా ఓడిపోవడాన్ని చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని ప్రధాన కోచ్ ఇగొర్ స్టామిక్ అన్నారు. 2019 సెప్టెంబర్‌లో గౌహతీలో ఇండియా, ఒమన్ మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో చివరి వరకు టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలో ఉన్నది. అయితే చివరిలో ఒమన్ రెండు వరుస గోల్స్ చేయడంతో టీమ్ ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. ఆనాటి సంగతిని గుర్తు తెచ్చుకున్న స్టిమాక్..’గత మ్యాచ్‌లను గుర్తు తెచ్చుకుంటే.. నేను ఏడ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఒమన్‌తో జరిగిన మ్యాచ్ మాకు ఎంతో కీలకమైనది.
ఈ మ్యాచ్ గెలవడం ద్వారా గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచి తర్వాతి రౌండ్‌కు క్వాలిఫై అవుదామని భావించాము. కానీ ఆటగాళ్ల అనుభవలేమి.. మా దురదృష్టం కారణంగా మ్యాచ్ ఒడిపోయాము. ఇలాంటివి నేను ఆటగాడిగా ఉన్నప్పుడు కూడా జరిగాయి. కానీ ఆ మ్యాచ్ మాత్రం నాకు కన్నీళ్లు తెప్పించింది’ అని అన్నాడు. కాగా, గురువారం రోజు ఒమన్‌తో టీమ్ ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నది.