వ్యాపారవేత్తపై హర్భజన్ ఫిర్యాదు.. ఎందుకంటే !

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై వ్యాపారవేత్త జి. మహేశ్ తన వద్ద రూ.4కోట్లు అప్పుగా తీసుకొని చెల్లించట్లేదని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహేశ్‌ ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ కామన్‌ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన మహేశ్‌కు 2015లో అప్పు ఇచ్చినట్లు హర్భజన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే అప్పు తీర్చమని ఎప్పుడు అడిగినా వాయిదాలు వేస్తూ వస్తున్నాడని, ఆగస్టు 18న రూ.25లక్షల చెక్ ఇస్తే […]

Update: 2020-09-09 10:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై వ్యాపారవేత్త జి. మహేశ్ తన వద్ద రూ.4కోట్లు అప్పుగా తీసుకొని చెల్లించట్లేదని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహేశ్‌ ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ కామన్‌ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన మహేశ్‌కు 2015లో అప్పు ఇచ్చినట్లు హర్భజన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే అప్పు తీర్చమని ఎప్పుడు అడిగినా వాయిదాలు వేస్తూ వస్తున్నాడని, ఆగస్టు 18న రూ.25లక్షల చెక్ ఇస్తే బౌన్స్ అయ్యిందని భజ్జీ చెప్పాడు. ఫిర్యాదును ఉన్నతాధికారులు ఏసీపీ విశ్వేశ్వరయ్యకు బదిలీ చేశారు. దీంతో తన ఎదుట విచారణకు హాజరు కావాలని మహేశ్‌కు ఏసీపీ నోటీసులు పంపారు.

Tags:    

Similar News