సిరీస్ గెలిస్తేనే విండీస్ ఆటగాళ్లకు బోనస్
దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎంపిక కాగానే డబ్బులు వచ్చి ఒడిలో పడుతాయని అందరు అనుకుంటుంటారు. మ్యాచ్ ఫీజులు, బోనస్‌లు కలిపి రూ.కోట్ల ఆదాయమని భావిస్తుంటారు. అయితే, అన్ని దేశాల క్రికెటర్లకు ఆ అవకాశం ఉండదు. దేశాల బోర్డు స్థితిగతులను బట్టే డబ్బయినా, సౌకర్యాలైనా అని మరోసారి రుజువైంది. చారిత్రాత్మక బయో బబుల్ టెస్ట్ మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న వెస్టిండీస్ జట్టు గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ‘రైజ్ ద బ్యాట్’ సిరీస్ గెలిస్తే […]
దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎంపిక కాగానే డబ్బులు వచ్చి ఒడిలో పడుతాయని అందరు అనుకుంటుంటారు. మ్యాచ్ ఫీజులు, బోనస్‌లు కలిపి రూ.కోట్ల ఆదాయమని భావిస్తుంటారు. అయితే, అన్ని దేశాల క్రికెటర్లకు ఆ అవకాశం ఉండదు. దేశాల బోర్డు స్థితిగతులను బట్టే డబ్బయినా, సౌకర్యాలైనా అని మరోసారి రుజువైంది. చారిత్రాత్మక బయో బబుల్ టెస్ట్ మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న వెస్టిండీస్ జట్టు గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ‘రైజ్ ద బ్యాట్’ సిరీస్ గెలిస్తే ఒక్కో విండీస్ ఆటగాడికి దక్కేది 1600 పౌండ్ల బోనస్ మాత్రమే. అంటే.. మన దేశ కరెన్సీలో రూ.1.51లక్షలు. 1988 తర్వాత ఇంగ్లండ్‌లో విండీస్ జట్టు టెస్టు సిరీస్ గెలువలేదు. అలాంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లో గెలిస్తే అంత తక్కువ బోనస్ ప్రకటించడంపై ఎవరికీ మింగుడు పడటం లేదు. మరోవైపు గెలిస్తేనే ఈ మొత్తం ఇస్తామని లేకుంటే అది కూడా దక్కదని విండీస్ బోర్డు చెబుతున్నది. మొదట రూ.1.77లక్షలు ఇస్తామని చెప్పినా ఇప్పుడా మొత్తాన్ని రూ.1.51లక్షలకు తగ్గించింది. ఇందుకు బోర్డు తీవ్రమైన ఆర్థిక సంక్షోభమే కారణం అని చెబుతున్నది. మరోవైపు ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు విజయం సాధిస్తే ఒక్కో క్రికెటర్ రూ.30.72లక్షలు బోనస్ అందుకోనున్నారు. విజయం సాధించిన ప్రతి మ్యాచ్‌కు అదనంగా రూ.6.14లక్షలు లభించనుంది.