గచ్చిబౌలిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రాజస్థాన్ కేంద్రంగా బెంగళూరు, ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను రాజస్థాన్ ఏటీఎస్, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన అశోక్ కుమార్ మెయిన్ యాక్సెస్‌తో హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న విషయాన్ని రాజస్థాన్ ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా ఈ బెట్టింగ్ బెంగళూరు, ముంబయి, ఢిల్లీ నగరాలలో కూడా నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ప్రధాన ఆర్గనైజర్ అశోక్‌కుమార్, గణేష్‌లు దేశవ్యాప్తంగా పలుప్రాంతాల్లో […]
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రాజస్థాన్ కేంద్రంగా బెంగళూరు, ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను రాజస్థాన్ ఏటీఎస్, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన అశోక్ కుమార్ మెయిన్ యాక్సెస్‌తో హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న విషయాన్ని రాజస్థాన్ ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా ఈ బెట్టింగ్ బెంగళూరు, ముంబయి, ఢిల్లీ నగరాలలో కూడా నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ప్రధాన ఆర్గనైజర్ అశోక్‌కుమార్, గణేష్‌లు దేశవ్యాప్తంగా పలుప్రాంతాల్లో కమీషన్ పద్దతిలో చాలా మంది ఏజెంట్లను ఆర్గనైజ్ చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా నగరానికి వచ్చిన రాజస్థాన్ ఏటీఎస్ పోలీసులు, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి బెట్టింగ్ రాయుళ్లను గచ్చిబౌలిలో అరెస్టు చేశారు. ప్రధాన ఆర్గనైజర్ రాజస్థాన్‌కు చెందిన అశోక్ కుమార్‌తో పాటు గణేష్, పంకజ్, సురేందర్, శాంతిలాల్, బీరారం పురోహిత్, మనోజ్‌లను అరెస్టు చేశారు. వీరినుంచి రూ.65వేల నగదు, బెట్టింగ్ బోర్డు, 4ల్యాప్‌టాప్‌లు, రెండు ట్యాబ్ లు, 46 సెల్‌ఫోన్లు, టీవీ స్వాధీనం చేసుకున్నారు.