ఐపీఎల్ ఆడటానికి రెడీగా ఉండండి: క్రికెట్ ఆస్ట్రేలియా
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐపీఎల్ ఆడటానికి సిద్ధంగా ఉండాలని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఆటగాళ్లకు సూచించింది. టీ20 వరల్డ్ కప్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే ఐపీఎల్ 13వ సీజన్ జరుగుతుంది. కాబట్టి ఆటగాళ్ల దానికి తగినట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఏ ఆటగాళ్లకు సమాచారం అందించినట్లు తెలుస్తున్నది. అయితే, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నిర్ణయం తీసుకోకపోవడమే బీసీసీఐకి ఆందోళన కలిగిస్తున్నది. ఐపీఎల్ 13వ సీజన్ వేదిక నిర్ణయించకపోయినా, తప్పకుండా […]
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐపీఎల్ ఆడటానికి సిద్ధంగా ఉండాలని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఆటగాళ్లకు సూచించింది. టీ20 వరల్డ్ కప్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే ఐపీఎల్ 13వ సీజన్ జరుగుతుంది. కాబట్టి ఆటగాళ్ల దానికి తగినట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఏ ఆటగాళ్లకు సమాచారం అందించినట్లు తెలుస్తున్నది. అయితే, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నిర్ణయం తీసుకోకపోవడమే బీసీసీఐకి ఆందోళన కలిగిస్తున్నది. ఐపీఎల్ 13వ సీజన్ వేదిక నిర్ణయించకపోయినా, తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నట్లు సీఏ స్పష్టం చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ కట్టుబడి ఉన్నట్లు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఐసీసీ తమ నిర్ణయాన్ని తెలియజేసిన తర్వాతే ఐపీఎల్‌పై ప్రకటన చేస్తామన్నారు. కాగా, ఐసీసీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ పదవి నుంచి తప్పుకోవడంతోనే నిర్ణయం ప్రకటన ఆలస్యమవుతున్నట్లు తెలుస్తున్నది.