క్రికెట్ ఆస్ట్రేలియాకు ఆయన రాజీనామా
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలిస్టెయిర్ నికల్సన్ తన పదవి నుంచి వైదొలిగారు. క్రికెట్ ఆస్ట్రేలియా అంటే తనకు ఎంతో ఇష్టమని, పదవి నుంచి తప్పుకోవడం బాధగా ఉందని నికల్సన్ పేర్కొన్నాడు. తన కాలంలో క్రికెట్ ఆస్ట్రేలియాలో జరిగిన మార్పులు చేర్పులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశాడు. 2014లో పౌల్ మార్ష్ స్థానంలో నికల్సన్ సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది ఆఖరుతో ఆయన పదవీకాలం పూర్తికానున్నది. అయితే, ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా […]
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలిస్టెయిర్ నికల్సన్ తన పదవి నుంచి వైదొలిగారు. క్రికెట్ ఆస్ట్రేలియా అంటే తనకు ఎంతో ఇష్టమని, పదవి నుంచి తప్పుకోవడం బాధగా ఉందని నికల్సన్ పేర్కొన్నాడు. తన కాలంలో క్రికెట్ ఆస్ట్రేలియాలో జరిగిన మార్పులు చేర్పులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశాడు. 2014లో పౌల్ మార్ష్ స్థానంలో నికల్సన్ సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది ఆఖరుతో ఆయన పదవీకాలం పూర్తికానున్నది. అయితే, ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ కోసం అన్వేషణ ప్రారంభించింది. దీంతో నికల్సన్ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన హయంలో సీఏలో ఎదురైన ఎన్నో సమస్యలను పరిష్కరించాడు.