క్రూ డ్రాగన్‌తో నాసా ప్లాన్ ఇదే!
స్పేస్‌ఎక్స్ సౌజన్యంతో మొదటిసారిగా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అది ఐఎస్ఎస్ మీద డాక్ అయ్యి ఉంది. కానీ, ఈలోగా క్రూ-2 మిషన్‌లో వెళ్లబోయే వారి జాబితాను నాసా ప్రకటించేసింది. నాసాకు చెందిన షేన్ కింబ్‌బరో, మేగన్ మెక్ ఆర్థర్, జాక్సాకు చెందిన అకిహికో హొషిడే, ఈఎస్ఏకు చెందిన థామస్ పెస్కెట్‌లు 2021లో క్రూ-2లో ప్రయాణం చేయనున్నట్లు […]
స్పేస్‌ఎక్స్ సౌజన్యంతో మొదటిసారిగా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అది ఐఎస్ఎస్ మీద డాక్ అయ్యి ఉంది. కానీ, ఈలోగా క్రూ-2 మిషన్‌లో వెళ్లబోయే వారి జాబితాను నాసా ప్రకటించేసింది. నాసాకు చెందిన షేన్ కింబ్‌బరో, మేగన్ మెక్ ఆర్థర్, జాక్సాకు చెందిన అకిహికో హొషిడే, ఈఎస్ఏకు చెందిన థామస్ పెస్కెట్‌లు 2021లో క్రూ-2లో ప్రయాణం చేయనున్నట్లు నాసా వెల్లడించింది. నాసా వారి డెమో-2 మిషన్‌తో పోల్చితే రెండు రెట్లు ఎక్కువ మంది ప్రయాణికులను ఇందులో పంపించబోతోంది. ఇక్కడే క్రూ డ్రాగన్‌తో నాసా అవసరాన్ని గమనించాలి.
గతంలో వ్యోమగామిని ఐఎస్ఎస్‌కు పంపించాలంటే రష్యా దేశం సూయజ్ మిషన్ ప్రారంభించే వరకూ నాసా ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ, క్రూ డ్రాగన్ క్యాప్సుల్‌తో ఇక ఆ అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నాసా వ్యోమగాములను ఐఎస్ఎస్‌కు పంపించుకునే అవకాశం కలిగింది. అంతేగాకుండా సూయజ్‌లో సీట్‌ల కోసం నాసా పెద్దమొత్తంలో రష్యాకు చెల్లించేది. ఇప్పుడు ఆ ఖర్చు మొత్తం తగ్గినట్టైంది. మొదట్నుంచి నాసా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే క్రూ ప్రోగ్రామ్‌ని స్పేస్ ఎక్స్‌తో కలిసి డిజైన్ చేసింది. మొదటి ప్రయోగం విఫలమైనపుడు బాధపడినా పట్టు విడవకుండా రెండో ప్రయోగం చేపట్టి విజయం సాధించింది. ఇక త్వరలో క్రూ డ్రాగన్ కిందకి దిగగానే ఈ క్యాప్సుళ్లను తరచుగా వాడటానికి నాసా సిద్ధమవుతోంది.