రూ. లక్ష కోట్ల క్రెడిట్ గ్యారంటీ ప్రకటించాలి: శ్రీధర్‌బాబు
దిశ, న్యూస్‌బ్యూరో: చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల క్రెడిట్ గ్యారంటీ ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ జీడీపీకి 35శాతం దోహదపడే పరిశ్రమలను ఇలాంటి సమయంలో ఆదుకోవాలని కోరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడం వల్ల దేశంలో చిన్న పరిశ్రమలకు రోజుకు రూ.30వేల కోట్ల నష్టం వస్తోందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పరిశ్రమలను ఆదుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక […]
దిశ, న్యూస్‌బ్యూరో: చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల క్రెడిట్ గ్యారంటీ ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ జీడీపీకి 35శాతం దోహదపడే పరిశ్రమలను ఇలాంటి సమయంలో ఆదుకోవాలని కోరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడం వల్ల దేశంలో చిన్న పరిశ్రమలకు రోజుకు రూ.30వేల కోట్ల నష్టం వస్తోందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పరిశ్రమలను ఆదుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భారం నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. ఉద్దీపన ప్యాకేజీ విషయంపై బీజేపీ నేతలు మాట్లాడినప్పటికీ కేంద్ర పెద్దలు నోరు మెదపకపోవడం సరికాదన్నారు.