సీరమ్‌కు రూ.3000 కోట్లు.. భారత్ బయోటెక్‌కు రూ. 1500 కోట్లు

న్యూఢిల్లీ: దేశంలో టీకా ఉత్పత్తికి దన్నుగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్లకు రుణ సదుపాయాన్ని కలిగించే నిర్ణయం తీసుకుంది. అతిపెద్ద టీకా తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు రూ. 3,000 కోట్లు, భారత్ బయోటెక్‌‌‌‌కు రూ. 1,500 కోట్ల రుణసదుపాయాన్ని అందించడానికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదాన్ని ఇచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేస్తుందని పేర్కొన్నాయి. వీలైనంత త్వరగా వీటిని ఆయా సంస్థలకు అందజేస్తారని […]

Update: 2021-04-19 10:32 GMT

న్యూఢిల్లీ: దేశంలో టీకా ఉత్పత్తికి దన్నుగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్లకు రుణ సదుపాయాన్ని కలిగించే నిర్ణయం తీసుకుంది. అతిపెద్ద టీకా తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు రూ. 3,000 కోట్లు, భారత్ బయోటెక్‌‌‌‌కు రూ. 1,500 కోట్ల రుణసదుపాయాన్ని అందించడానికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదాన్ని ఇచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఈ మొత్తాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేస్తుందని పేర్కొన్నాయి. వీలైనంత త్వరగా వీటిని ఆయా సంస్థలకు అందజేస్తారని వివరించాయి. కొవాగ్జిన్ టీకా ఉత్పత్తికి భారత్ బయోటెక్‌కు రూ. 65 కోట్ల రుణ సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 3000 కోట్లను సహకరించాలని సీరం సీఈవో అదర్ పూనావాలా ఇటీవలే ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

Tags:    

Similar News