‘ఎంతో మంది పేదలు ప్రభుత్వ పథకాలకు నోచుకోలేదు’

దిశ, మునుగోడు: అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. యాదాద్రి -భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్దీవో కార్యాలయం ఎదుట మంగళవారం సీపీఐ(ఎం) నాయకులు ధర్నాకి దిగి అనంతరం మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఐదేండ్ల నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేదని దీంతో నిరుపేదలు ఎంతో మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారని అన్నారు. కరోనా విపత్కర సమయంలో అయిన అర్హులైన నిరుపేదలకు వెంటనే రేషన్ కార్డులు […]

Update: 2020-07-14 09:59 GMT

దిశ, మునుగోడు: అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. యాదాద్రి -భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్దీవో కార్యాలయం ఎదుట మంగళవారం సీపీఐ(ఎం) నాయకులు ధర్నాకి దిగి అనంతరం మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఐదేండ్ల నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేదని దీంతో నిరుపేదలు ఎంతో మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారని అన్నారు. కరోనా విపత్కర సమయంలో అయిన అర్హులైన నిరుపేదలకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు లాగా నెలకు రూ.1500 కరోనా వైరస్ వ్యాప్తి తగ్గేవరకూ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కరోనా భృతి కింద నెలకు రూ.7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం నాయకులు తమ డిమాండ్లతో ఆర్దీవోకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News