ఫెడరల్ వ్యవస్థపై బీజేపీ దాడి: రాఘవులు

దిశ, తెలంగాణ బ్యూరో: భారత ఫెడరల్ వ్యవస్థపై బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ రెండు రోజుల సమావేశాల సందర్భంగా సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రాల హక్కులను హరించేలా వ్యవహరిస్తున్న మోడీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలని కోరారు. జీఎస్టీ బకాయిలను చెల్లించడం లేదని, నిధులు, ఆర్థిక సాయాలను కూడా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రాలు సొంతంగా అప్పులు తీసుకోవాలన్నా కేంద్రం చెప్పిన […]

Update: 2021-01-04 10:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భారత ఫెడరల్ వ్యవస్థపై బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ రెండు రోజుల సమావేశాల సందర్భంగా సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రాల హక్కులను హరించేలా వ్యవహరిస్తున్న మోడీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలని కోరారు. జీఎస్టీ బకాయిలను చెల్లించడం లేదని, నిధులు, ఆర్థిక సాయాలను కూడా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రాలు సొంతంగా అప్పులు తీసుకోవాలన్నా కేంద్రం చెప్పిన షరతులుగా అంగీకరించేలా మోడీ విధానాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఆస్తి పన్నులను భారీగా పెంచడంతో పాటు, బోరుబావులకు మీటర్లు బిగించడం అందులో భాగమేనని వివరించారు. రైతాంగ ఉద్యమానికి సీపీఎం మద్దతుగా ఉంటుదని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్రాల గవర్నర్లు బీజేపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పంటలను కోనుగోలు చేయాలని, పీఆర్‌సీపై త్రీసభ్య కమిటీ పేరుతో కాలయాప చేయొద్దని కోరారు. ఎల్‌ఆర్ఎస్‌‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హామీనిచ్చిన విధంగా పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ఉన్నారు.

Tags:    

Similar News