రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది: రాఘవులు
దిశ, ఏపీ బ్యూరో: ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తూ కేంద్రం రాష్ర్టాల హక్కులను కాలరాస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ చివరకు రాష్ర్టంలోని ఓడరేవులను కూడా లాక్కోవాలని చూస్తుందన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రాంతీయ పార్టీలపై ఉందని, ప్రాంతీయ పార్టీల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా రాష్ట్ర హక్కుల విషయంలో కేంద్రంపై కలసి పోరాడాలని సూచించారు. ఇందుకోసం ఏపీలో వైసీపీ, టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ముందుకు […]
దిశ, ఏపీ బ్యూరో: ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తూ కేంద్రం రాష్ర్టాల హక్కులను కాలరాస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ చివరకు రాష్ర్టంలోని ఓడరేవులను కూడా లాక్కోవాలని చూస్తుందన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రాంతీయ పార్టీలపై ఉందని, ప్రాంతీయ పార్టీల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా రాష్ట్ర హక్కుల విషయంలో కేంద్రంపై కలసి పోరాడాలని సూచించారు. ఇందుకోసం ఏపీలో వైసీపీ, టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ముందుకు రావాలని రాఘవులు పిలుపునిచ్చారు. సుదీర్ఘ కాలం ప్రజా నాయకుడిగా ఉన్న పోపూరి రామారావు పేరుపై విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.