ఆ కుటుంబాలకు డబ్బులు చెల్లించాలి: సీపీఎం నేత మధు

దిశ, ఏపీ బ్యూరో: పోలవరం నిర్వాసితులకు పునరావాసం పూర్తయ్యేంత వరకు ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని సీపీఎం నేత మధు డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పరిహారం కేంద్ర ప్రభుత్వం ఒకేసారి చెల్లించేలా జగన్ సర్కార్ ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. 1986 నాటి వరద ముంపు లెక్కల ప్రకారం ముంపు గ్రామాలన్నింటికీ ఒకేసారి పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జూలై నుంచి డిసెంబర్ నెల వరకు ముంపుకు గురయ్యే ప్రతి కుటుంబానికి నెలకు రూ. 7,500 పరిహారం […]

Update: 2021-06-28 04:36 GMT

దిశ, ఏపీ బ్యూరో: పోలవరం నిర్వాసితులకు పునరావాసం పూర్తయ్యేంత వరకు ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని సీపీఎం నేత మధు డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పరిహారం కేంద్ర ప్రభుత్వం ఒకేసారి చెల్లించేలా జగన్ సర్కార్ ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. 1986 నాటి వరద ముంపు లెక్కల ప్రకారం ముంపు గ్రామాలన్నింటికీ ఒకేసారి పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జూలై నుంచి డిసెంబర్ నెల వరకు ముంపుకు గురయ్యే ప్రతి కుటుంబానికి నెలకు రూ. 7,500 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొండలు, గుట్టలపై నివాసాలు ఏర్పరుచుకున్నవారికి మంచినీరు, ఆహారం, మందులు, టార్పాలిన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలపై త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చిస్తామన్నారు. నిర్వాసితులను తక్షణమే ఆదుకోవాలని… లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని సీపీఎం నేత మధు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Tags:    

Similar News