సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శుక్రవారం లేఖ రాశారు. ఏళ్ల తరబడి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్​ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. 6 నెలలుగా వీరికి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో […]

Update: 2020-09-25 09:15 GMT

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శుక్రవారం లేఖ రాశారు. ఏళ్ల తరబడి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్​ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. 6 నెలలుగా వీరికి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో సాంకేతిక లోపం కారణంగా గత సంవత్సరంలో వీరికి 10నెలల వేతనమే విడుదలైందని రామకృష్ణ పేర్కొన్నారు.

Tags:    

Similar News