జగన్ గారూ.. మీటింగ్ ఏర్పాటు చేయండి: రామకృష్ణ

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. ఏపీలో 1,02,349 కరోనా పాజిటివ్ కేసులు, 1090 మరణాలు సంభవించాయని గుర్తు చేసిన ఆయన, సరైన వైద్యం అందక కరోనా రోగులు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఆహారం కోసం మనిషిపై రోజుకి 500 రూపాయలు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ […]

Update: 2020-07-27 22:06 GMT

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. ఏపీలో 1,02,349 కరోనా పాజిటివ్ కేసులు, 1090 మరణాలు సంభవించాయని గుర్తు చేసిన ఆయన, సరైన వైద్యం అందక కరోనా రోగులు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఆహారం కోసం మనిషిపై రోజుకి 500 రూపాయలు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కరోనా అనుమానితులు, బాధితులకి సరైన ఆహారం అందటం లేదని విమర్శించారు.

రాష్ట్రంలో పెరిగిపోతున్న కరోనా రోగులకు వైద్యం అందించలేక వైద్యులు, వైద్య సిబ్బంది సతమతమవుతున్నారని ఆరోపించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చినప్పటికీ కార్పొరేట్ ఆస్పత్రులలో డబ్బులు చెల్లించకుండా వైద్యం చేయడం లేదని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో ప్రభుత్వం చేతులెత్తేయడం తగదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని రామకృష్ణ లేఖలో డిమాండ్ చేశారు.

Tags:    

Similar News