వాళ్ల పై అట్రాసిటీ కేసులు పెట్టాలి : సిపిఐ నారాయణ
దిశ సూర్యా పేట; జిల్లా కేంద్రంలోని మెట్రో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆత్మకూరు (యస్ ) మండలం రామోజీ తండా కు చెందిన గూగులోతు వీరేశేఖర్ ను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన యువకుని దొంగతనం చేసాడనే నేపంతో ఏలాంటి సాక్ష్యాలు లేకుండా కావాలనే దురుద్ధేశంతో పోలీస్ స్టేషన్ కు తరలించి తమ ఇష్టం వచ్చినట్లు, విచక్షణారహితంగా రెండు గంటలపాటు కొట్టడం ఏంటని ప్రశ్నించారు. సృహ కోల్పోయిన […]
దిశ సూర్యా పేట; జిల్లా కేంద్రంలోని మెట్రో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆత్మకూరు (యస్ ) మండలం రామోజీ తండా కు చెందిన గూగులోతు వీరేశేఖర్ ను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన యువకుని దొంగతనం చేసాడనే నేపంతో ఏలాంటి సాక్ష్యాలు లేకుండా కావాలనే దురుద్ధేశంతో పోలీస్ స్టేషన్ కు తరలించి తమ ఇష్టం వచ్చినట్లు, విచక్షణారహితంగా రెండు గంటలపాటు కొట్టడం ఏంటని ప్రశ్నించారు. సృహ కోల్పోయిన వీరశేఖర ను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని, తర్వాత మెట్రో హాస్పిటల్ చేర్పించిన విధానం చూస్తుంటే అక్కడి పోలీసుల వికృత చేష్టలకు పరాకాష్ట అన్నారు.
ఇంకా గిరిజనులపై అక్రమ కేసులు, వేధింపులు కొనసాగిస్తున్నాయని, ఇదంతా కావాలనే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నారని విమర్శించారు. ఈ సంఘటన ను సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు . ఈ సంఘటన పై తక్షణమే పై అధికారులు స్పందించి ఎస్సై కానిస్టేబుల్, వారిపై ఎస్సీ ,ఎస్టీ ,అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలన్నారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం క్రింద 25 లక్షలు ఇవ్వాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి రిటైర్డ్ జడ్జి ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేశారు.