ఆ కారణంగానే విద్యుత్ చార్జీలు పెరగలేదు : వీరయ్య

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రజా పోరాటాలకు విద్యుత్ ఉద్యమం మార్గదర్శకం అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. విద్యుత్ సమర వీరుల సంస్మరణ సభ శుక్రవారం సీపీఐ(ఎం) నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం వీరయ్య మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి టీడీపీ ప్రభుత్వం ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా విద్యుత్ చార్జీలు పెంచడంతో, రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలలు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందని […]

Update: 2020-08-28 05:45 GMT
ఆ కారణంగానే విద్యుత్ చార్జీలు పెరగలేదు : వీరయ్య
  • whatsapp icon

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రజా పోరాటాలకు విద్యుత్ ఉద్యమం మార్గదర్శకం అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. విద్యుత్ సమర వీరుల సంస్మరణ సభ శుక్రవారం సీపీఐ(ఎం) నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం వీరయ్య మాట్లాడుతూ…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి టీడీపీ ప్రభుత్వం ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా విద్యుత్ చార్జీలు పెంచడంతో, రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలలు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందని తెలిపారు. ఈ ఉద్యమంలో ముగ్గురి ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, ఆ స్ఫూర్తితో తర్వాత ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు మూలంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కరోనా వ్యాధితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో రాబోయే కాలంలో పోరాటాలను జయప్రదం చేయాలన్నారు.

Tags:    

Similar News