వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించండి
దిశ, సూర్యాపేట: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు వరి, పత్తి, పెసర కంది పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో జరిగిన సీపీఐ(ఎం) సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో వరి, పత్తి, పెసర, కంది పంటలు నీట మునగడంతో రైతులు పెద్ద […]
దిశ, సూర్యాపేట: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు వరి, పత్తి, పెసర కంది పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో జరిగిన సీపీఐ(ఎం) సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో వరి, పత్తి, పెసర, కంది పంటలు నీట మునగడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతకొన్ని రోజులు నిర్విరామంగా వర్షాలు పడటంతో పెసర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దీంతో రైతు లుతీవ్రంగా నష్టపోయారని తెలిపారు. దెబ్బతిన్న వరి, పత్తి, పెసర, కంది పంటలకు బాగా నష్టం జరిగిందని, తక్షణమే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తక్షణమే గ్రామాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే రైతులకు ఎకరాకు 20 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున జిల్లాలో పంట నష్టపోతే నేటికీ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయకపోవడం సరికాదన్నారు.