నూతన విద్యా విధానంపై సీపీఐ నారాయణ వ్యతిరేకం
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చేందుకు బుధవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఐ నేత నారాయణ తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా బీజేపీపై ఆరోపణలు చేశారు. నూతన విద్యా విధానం పేరుతో ఆర్ఎస్ఎస్ భావజాలన్ని దేశంలో వ్యాప్తి చేసేందుకు కేంద్రం కుట్రపన్నిందన్నారు. ఎంతో మంది సీనియర్ ఉపాధ్యాయులు ఇచ్చిన నివేదికలను కేంద్రం పక్కన బెట్టిందని నారాయణ విమర్శించారు. కేంద్ర తీసుకొస్తున్న నూతన విద్యా విదానంపై వ్యతిరేకంగా […]
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చేందుకు బుధవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఐ నేత నారాయణ తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా బీజేపీపై ఆరోపణలు చేశారు.
నూతన విద్యా విధానం పేరుతో ఆర్ఎస్ఎస్ భావజాలన్ని దేశంలో వ్యాప్తి చేసేందుకు కేంద్రం కుట్రపన్నిందన్నారు. ఎంతో మంది సీనియర్ ఉపాధ్యాయులు ఇచ్చిన నివేదికలను కేంద్రం పక్కన బెట్టిందని నారాయణ విమర్శించారు. కేంద్ర తీసుకొస్తున్న నూతన విద్యా విదానంపై వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన ప్రతి పక్షాలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు, నాయకులు, ఉపాధ్యాయులు దీనిపై వ్యతిరేక పోరాటం చేయాలన్నారు.