హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్నిపార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పత్రికలకు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో హెచ్చరించారు. అఖిలపక్ష నేతలను కేసీఆర్ ఆహ్వానిస్తే అందరూ కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవచ్చని సూచించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకుంటే ప్రజలు ఆకలి చావులతో చనిపోయే ప్రమాదం ఉందన్నారు. కరోనా కష్టకాలంలో కరెంటు […]
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్నిపార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పత్రికలకు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో హెచ్చరించారు. అఖిలపక్ష నేతలను కేసీఆర్ ఆహ్వానిస్తే అందరూ కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవచ్చని సూచించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకుంటే ప్రజలు ఆకలి చావులతో చనిపోయే ప్రమాదం ఉందన్నారు. కరోనా కష్టకాలంలో కరెంటు బిల్లులు ప్రజలపై పెద్ద ఎత్తునమోపడం సరికాదన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేయగానే ప్రజలకు ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోందని, కానీ ఉపాధిలేక ప్రజలు చస్తూ బతుకుతున్నారన్నారు.