మేడిపండు సామెతలా ఉంది !

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అంకెల గారడిలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు, కూలీలకు ప్రభుత్వం అందిస్తున్న సాయం కంటితుడుపుగా ఉందని, కార్మికులు, చేతి వృత్తులవారికి కేటాయింపులు నిరాశజనకంగా ఉన్నాయని మండిపడ్డారు. వలస కార్మికులు రోడ్లపై వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూ యాక్సిడెంట్లలో చనిపోతున్నారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం […]

Update: 2020-05-17 09:02 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అంకెల గారడిలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు, కూలీలకు ప్రభుత్వం అందిస్తున్న సాయం కంటితుడుపుగా ఉందని, కార్మికులు, చేతి వృత్తులవారికి కేటాయింపులు నిరాశజనకంగా ఉన్నాయని మండిపడ్డారు. వలస కార్మికులు రోడ్లపై వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూ యాక్సిడెంట్లలో చనిపోతున్నారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రైవేటీకరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై సొంత అజెండాను తెరపైకి తేవడాన్ని ఖండిస్తున్నామన్నారు. రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన కేటాయింపులు మేడిపండు సామెతలా ఉన్నాయని విమర్శించారు.

Tags:    

Similar News