కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డి ఫ్యామిలీకి అండగా ఉంటాం: సీపీ

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్‌ బారినపడి చనిపోయిన కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డికి కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో సీపీ అంజనీకుమార్ శనివారం 2నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ నగరంలోని స్టేషన్ల పరిధిలో తనిఖీలు చేపడుతున్న పోలీసులు తప్పనిసరిగా మాస్క్‌లు, శానిటైజర్లతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముంబయిలో 900మంది పోలీసులు కరోనా వైరస్ బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. దయాకర్‌రెడ్డి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చాలా కష్టపడి పనిచేశారని, ఆయన కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. […]

Update: 2020-05-23 08:11 GMT

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్‌ బారినపడి చనిపోయిన కానిస్టేబుల్ దయాకర్‌రెడ్డికి కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో సీపీ అంజనీకుమార్ శనివారం 2నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ నగరంలోని స్టేషన్ల పరిధిలో తనిఖీలు చేపడుతున్న పోలీసులు తప్పనిసరిగా మాస్క్‌లు, శానిటైజర్లతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముంబయిలో 900మంది పోలీసులు కరోనా వైరస్ బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. దయాకర్‌రెడ్డి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చాలా కష్టపడి పనిచేశారని, ఆయన కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. దయాకర్‌రెడ్డి భార్యకు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పిల్లల చదువు గురించి ఎన్జీవో సంస్థతో చర్చించామని పేర్కొన్నారు.

Tags:    

Similar News