సమాచారం ఇస్తే… రూ.లక్ష ఇస్తాం

దిశ, వెబ్‌డెస్క్: స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విషయమై గురువారం విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ… స్వర్ణ ప్యాలెస్ హోటల్, రమేష్ ఆసుపత్రి యాజమాన్యాల మధ్య ఏం జరిగిందో కూడా చెప్పలేకపోతున్నారని తెలిపారు. అంతేగాకుండా చికిత్సకు అధికంగా డబ్బులు వసూలు చేశారని విచారణతో తేలిందని స్పష్టం చేశారు. స్వర్ణ ప్యాలెస్ కేసులో కీలక సమాచారం ఇస్తే.. రూ.లక్ష బహుమతి ఇస్తామని సీపీ నజరానా ప్రకటించారు. […]

Update: 2020-08-20 07:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విషయమై గురువారం విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ… స్వర్ణ ప్యాలెస్ హోటల్, రమేష్ ఆసుపత్రి యాజమాన్యాల మధ్య ఏం జరిగిందో కూడా చెప్పలేకపోతున్నారని తెలిపారు.

అంతేగాకుండా చికిత్సకు అధికంగా డబ్బులు వసూలు చేశారని విచారణతో తేలిందని స్పష్టం చేశారు. స్వర్ణ ప్యాలెస్ కేసులో కీలక సమాచారం ఇస్తే.. రూ.లక్ష బహుమతి ఇస్తామని సీపీ నజరానా ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు, నిబంధనలు లేకుండా ఆస్పత్రి నిర్వహించారని తెలిపారు. ఈ విచారణకు ముద్దాయిలు, అనుమానితులు సహకరించడం లేదని అన్నారు.

Tags:    

Similar News